Darshan: అభిమాని రేణుకా స్వామి హత్యకేసులో అరెస్ట్ అయిన కన్నడ స్టార్ హీరో దర్శన్ కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణాలతో బెయిల్ పై బయటకు వచ్చారు. ఆయనకు అప్పట్లో కోర్టు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే… తాజాగా కోర్టు శుక్రవారం అతనితోపాటు అరెస్ట్ అయిన మిగిలిన నిందితులకూ బెయిల్ ఇచ్చింది. ఈ హత్యకేసులో దర్శన్ అనుచరులు నాగరాజు, అనుకుమార్, లక్ష్మణ్, జగదీశ్, ప్రదూష్ రావు నిందితులుగా ఉన్నారు. వీరంతా డిసెంబర్ 16న జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే…. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ తో సహా 15 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు.

