Danam Nagender

Danam Nagender: బీఆర్‌ఎస్ యాక్షన్‌కు నా రియాక్షన్ గ్యారెంటీ.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై వస్తున్న అనర్హత వేటు అంశంపై తాజాగా స్పందించారు. బీఆర్‌ఎస్ పార్టీ తనపై తీసుకునే చర్యలను బట్టే తన తదుపరి నిర్ణయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో తాను దేనికీ వెనకడుగు వేయనని, ఎన్నికలంటే తనకు భయం లేదని ధీమా వ్యక్తం చేశారు.

అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన నోటీసులపై దానం మాట్లాడుతూ.. ఆ నోటీసులకు సంబంధించి తన తరపు న్యాయవాది ఇప్పటికే స్పీకర్‌కు లేఖ రాశారని తెలిపారు. అయితే ఆ లేఖకు ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని ఆయన పేర్కొన్నారు. విచారణకు తాను వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. బీఆర్‌ఎస్ పార్టీ తనను ఇంకా సస్పెండ్ చేయలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ యాక్షన్ బట్టే నా రియాక్షన్ ఉంటుంది అని వ్యాఖ్యానించడం ద్వారా భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు అనే సంకేతాలిచ్చారు. ఏదేమైనా ప్రజా క్షేత్రంలో తేల్చుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని దానం నాగేందర్ నొక్కి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *