Daggubati Purandeswari

Daggubati Purandeswari: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై స్పందించిన పురంధేశ్వరి

Daggubati Purandeswari: సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసు లో అల్లు అర్జున్ ని పోలీస్ లు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ పైన స్పందించిన దగ్గుబాటి పురంధేశ్వరి. అల్లు అర్జున్ ఒక హీరో గా తన సినిమా చూడడానికి సంధ్య థియేటర్‌ కి వెళ్లారు. అప్పుడు ఆ సమయంలో జరిగిన ప్రమాదం ఆయన ప్రేరేపించింది కాదు. కానీ ఈ కేసు లో మిగిలినవారిని అరెస్ట్ చేయకుండా. ఏ 11గా ఉన్న అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేయడం సరికాదు అంటూ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.

ఇది కూడా చదవండి: OTT Highest Digital Rights: OTT ఎక్కువ రేట్ కి కొన్న సినిమాలు ఇవే.. ఏది NO.1 అంటే..?

ఘటనలో ఎవరి తప్పులేదు.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అల్లు అర్జున్ రిప్లై

Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల జరిగిన ఒక బాధాకరమైన ఘటనపై తన భావాలను మీడియా ఎదుట పంచుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన ఆరోపణలపై స్పందించిన అల్లు అర్జున్, ఈ ఘటన తనకు తీవ్ర మనోవేదన కలిగించిందని చెప్పారు.

అయితే, ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని, ఆమె కుటుంబానికి, ముఖ్యంగా ఆమె భర్తకు తన ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ, “ఈ ఘటన ఎవరి తప్పు కాదు. ఇది దురదృష్టకరమైన యాక్సిడెంట్. మేము మంచి సినిమా అందించడానికి శ్రమించాం, థియేటర్ యాజమాన్యం కూడా తమవంతుగా ప్రయత్నించారు. పోలీసులు కూడా రక్షణ కల్పించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. అయినప్పటికీ, ఈ సంఘటన జరిగింది. ఇది ఎవరి నియంత్రణలోనూ లేదు. ఆ కుటుంబం కోలుకోవడానికి మేము చేయగలిగిన సహాయం చేస్తాము” అని పేర్కొన్నారు.

మిగిలిన వార్త ఇక్కడ చదవండి: Allu Arjun: ఘటనలో ఎవరి తప్పులేదు.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అల్లు అర్జున్ రిప్లై

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *