Cyber Scam : ఈ చలాన్ పేరుతో మార్కెట్లోకి కొత్త స్కాం.. అలర్ట్ గా ఉండండి

Cyber Scam : జనాలని ఎట్లా మోసం చేయాలని రోజుకో కొత్తదారి వెతుక్కుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. నాయకులని ఎలా బుట్టలో వేసుకోవాలి వారి నుంచి డబ్బులు ఎలా లాగానే దానిమీద పీహెచ్డీలు చేస్తున్నారు. రోజుకో విధంగా ఘరానా మోసం చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. మీరు బారిన పడకుండా ఉండకు ప్రభుత్వాలు పోలీసులు ప్రజలకు ఎంత చెప్పినా గాని ఏదో ఒక విధంగా ఈ మాయగాల్ల మూటలో పడిపోతున్నారు. సైబర్‌ నేరగాళ్లు జనాన్ని మోసం చేసేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. తాజాగా కొత్త ప్లాన్ తో వచ్చారు.

ఈ-చలాన్‌ పేరుతో మన బ్యాంక్‌ అకౌంట్లకు కన్నం వేస్తున్నారు. అధికారిక ఈ-చలాన్‌ వెబ్‌సైట్‌ను పోలి ఉండేలా నకిలీ వెబ్‌సైట్‌ను తయారుచేశారు. ‘మీ వాహనానికి రూ.500 ట్రాఫిక్‌ చలాన్‌ పడింది. ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసేందుకు ఈ లింక్‌ క్లిక్‌ చేయండి’ అంటూ జనానికి నకిలీ లింక్‌తో కూడిన ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నారు.ఈ లింక్‌ ఓపెన్‌ చేస్తే బ్యాంక్‌ అకౌంట్లు హ్యాక్‌ అయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

ఈ చలాన్‌కు సంబంధించి https://echallan.parivahan.gov.in అసలైన లింక్‌ అని, సైబర్‌ నేరగాళ్లు https:// echallanparivahan.in అనే నకిలీ లింక్‌ను పంపిస్తున్నారని పేర్కొన్నది. ఇలాంటి నకిలీ లింక్‌లను క్లిక్‌ చేయవద్దని సూచించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ షెడ్యూల్: ప్రధాని మోదీతో యోగా వేడుకల్లో పాల్గొననున్న పవన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *