Cyber Crime: సైబర్ నేరగాళ్లు రోజురోజకూ అప్‌డేట్ అవుతున్నారు.. ఎప్పటికప్పుడు ఎలా ప్రవర్తించాలో అడ్వాన్స్ అయిపోతున్నారు.. తాజా ఇష్యూలతో బేరీజు వేసుకొని మరీ రంగంలోకి దిగుతున్నారు.. వివరాల కోసం లోకల్ వ్యక్తులను అప్రోచ్ అవుతున్నారు.. ఆ తర్వాత తమ పనిని సులువుగా కానిచ్చేస్తున్నారు.. తాజాగా సైబర్ నేరగాళ్లు ఓ జడ్జి పేరు చెప్పి ఓ రిటైర్డ్ ఇంజినీరును బోల్తా కొట్టించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది.
Cyber Crime: హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురంలో రిటైర్డ్ చీఫ్ ఇంజినీరుగా పనిచేసిన వ్యక్తి కుటుంబం నివాసం ఉంటున్నది. ఆయన గురించి ఎవరో స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆయనను బురిడీ కొట్టించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇక రంగంలోకి దిగింది సైబర్ నేరగాళ్ల ముఠా.
Cyber Crime: సైబర్ నేరగాళ్ల ముఠా నుంచి రిటైర్డ్ చీఫ్ ఇంజినీరుకు ఫోన్ కాల్ వచ్చింది. ఒక కేసులో తన పేరు వచ్చిందని, ఈ కేసును సుప్రీంకోర్టులోని ఓ జడ్జి విచారిస్తున్నారని సమాచారం చేరవేశారు. ఆయన నుంచి వీడియో కాల్ వస్తుందని, ఆయనతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలంటూ సైబర్ నేరగాళ్ల ముఠా సూచించింది.
Cyber Crime: కొద్దిసేపటికి సైబర్ నేరగాళ్ల ముఠా చెప్పినట్టుగా జడ్జి పేరిట వీడియో కాల్ రానే వచ్చింది. వారు చెప్పినట్టే రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు ఆయనతో మర్యాదపూర్వకంగా మాట్లాడారు. తన పేరు ఒక పెద్ద కేసులో ఉన్నదని, అరెస్టు చేయాల్సి వస్తుందని ఆ నకిలీ జడ్జి ఆ ఇంజినీరును బెదిరించాడు. కేసు విషయంలో సుప్రీంకోర్టుకు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని, కేసు ముగిశాక తిరిగిన తన అకౌంట్‌లో సొమ్ము పడుతుందని నమ్మబలికాడు. దీంతో ఆ రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు రూ.1.50 కోట్లను ఆయన చెప్పిన మేరకు డిపాజిట్ చేశాడు.
Cyber Crime: ఎన్ని రోజులు గడిచినా తన సొమ్ము వెనక్కి తిరిగిరాకపోవడంతో ఆరా తీశాడు. తాను మోసపోయానని గ్రహించడం రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు వంతైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఇదిగో ఈ రిటైర్డ్ చీఫ్ ఇంజినీరులా మోసపోవాల్సి వస్తుంది. ఏదైనా కేసు విషయంలో జడ్జి ఇలా ముందస్తుగా ఫోన్ చేస్తారా? అసలు డబ్బు ఎందుకు ఇవ్వాలి? అసలు ఈ విషయంపై కొంత గడువు తీసుకొని ఆరా తీయాలని ఎందుకు భావించలేదు? ఉన్నతాధికారిగా పనిచేసిన ఆయనకు ఆయా విషయాలు ఎందుకు గుర్తుకు రాలేదో తెలియదు మరి.