L2: Empuraan

L2: Empuraan: ‘ఎంపురాన్’ పై విమర్శలు!

L2: Empuraan: మోహన్‌లాల్ హీరోగా నటించిన తాజా చిత్రం “ఎల్ 2 – ఎంపురాన్” ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా. దర్శకుడు మరియు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ రూపొందించిన ఈ చిత్రం మలయాళంలో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్ సాధించింది. మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా, పార్ట్ 1 “లూసిఫర్” స్థాయి బ్లాక్‌బస్టర్ టాక్‌ను మాత్రం అందుకోలేకపోయింది. అయినప్పటికీ, ఈ చిత్రానికి బలమైన బుకింగ్స్ నమోదవుతున్నాయి. అయితే, సోషల్ మీడియాలో సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రారంభ సన్నివేశాలతో సహా కొన్ని ఎపిసోడ్‌లు ఉద్దేశపూర్వకంగా రూపొందినట్లు కనిపిస్తున్నాయని కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా మతపరమైన అంశాలపై కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు పృథ్వీరాజ్‌పై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rohit Sharma: వారసుడు వచ్చాడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన రోహిత్ సతీమణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *