Crime News:సోషల్ మీడియా విస్తృతమైన ఈ తరుణంలో ఏది మంచి, ఏది చెడు.. ఎవరు మంచి, ఎవరు చెడ్డ.. అన్న విచక్షణను గుర్తించలేకపోతున్నారు. తియ్యటి మాటలతో ఎందరో స్నేహం పంచుతూ, ఆ ముసుగులో నయవంచనకు దిగుతున్నారు. ఆ దుష్టపన్నాగాన్ని పసిగట్టలేని అమాయకులైన మహిళలు ఎందరో బలవుతున్నారు. ఇక్కడా అదే జరిగింది. ఫేస్‌బుక్ పరిచయం ఆమెను వంచనకు గురిచేసింది.
Crime News:హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో నివసిస్తున్న 24 ఏళ్ల యువతికి 2023 ఫిబ్రవరిలో ఫేస్‌బుక్ ద్వారా మహేంద్రవర్ధన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా చనువుకు దారితీసింది. ఇద్దరూ ఫోన్ నంబర్లను తెలుసుకొని మాట్లాడుకోసాగారు. మంచితనంగా భావించింది ఆ యువతి. ఇదే అదునుగా ఆమెను వంచించవచ్చని మహేంద్రవర్ధన్ దుష్ట పన్నాగం పన్నాడు. దీనిని ఆ యువతి గమనించలేకపోయింది.
Crime News:గత ఆగస్టు 15వ తేదీన మహేంద్రవర్ధన్ ఆ యువతిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. స్నేహితుడిగా భావించిన ఆ యువతి అతని ఆహ్వానాన్ని మన్నించి అతని ఇంటికి భోజనానికి వెళ్లింది. ఇంటికొచ్చిన ఆ యువతిని మాటల్లో పెట్టి మత్తు మందు ఇచ్చాడు. తాను ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న సమయం రానే వచ్చిందని, ఆమెపై లైంగికదాడికి ఒడిగట్టాడు.
Crime News:మరునాడు ఉదయం వరకు ఆమెను అనుభవించాడు ఆ దుండగుడు. ఆమె నిద్ర నుంచి లేచే సరికి ఆమె చేతిలో ఫొటోలు పెట్టాడు. వీడియోల రీల్ తిప్పాడు. దీంతో అవాక్కవడం ఆమె వంతయింది. తాను ఆమెను లైంగికంగా దారుణానికి పాల్పడిన ఫొటోలు, వీడియోలను చూపించి తనకు రూ.20 లక్షలు ఇవ్వాలని మహేంద్రవర్ధన్ ఆ యువతిని బెదిరింపులకు పాల్పడ్డాడు. లేదంటే ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు.
Crime News:దీంతో అతడు అడిగిన మొత్తాన్ని ఆ యువతి ఇచ్చింది. తాను మోసపోయానని భావించి అతనికి దూరంగా ఉండసాగింది. అయినా ఆ యువతిని మహేంద్రవర్ధన్ వదలడం లేదు. గత కొన్నాళ్లుగా తనకు రూ.కోటి ఇవ్వాలని బాధితురాలిని వేధిస్తూ వస్తున్నాడు. అంత మొత్తం తాను ఇచ్చుకోలేనని ఆమె వేడుకోసాగింది. ఇవ్వకుంటే ఆ ఫొటోలు, వీడియోలను నెట్‌లో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో చేసేది లేక విసిగి వేసారిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. తన గోడు చెప్పుకొని మహేంద్రవర్ధన్‌పై ఆ బాధితురాలు ఫిర్యాదు చేసింది. మంచికి పోతే చెడు ఎదురైంది.. అన్న సామెతకు ఇలాంటివే నిదర్శనాలు.