Crime News:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకున్నది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. అతని తండ్రి వచ్చి తలుపు తీసే సరికి ఇద్దరు పిల్లలు విగతజీవులగా మంచాలపై పడి ఉన్నారు. పిల్లల తండ్రి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Crime News:ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామానికి చెందిన వేములవాడ రవిశంకర్, చంద్రిక దంపతులు. వారికి హిరణ్య (9), లీలసాయి (7) అనే పేరున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు నెలల క్రితం పిల్లలను, భర్తను వదిలి చంద్రిక ఎటో వెళ్లిపోయింది. దీంతో రవిశంకర్ తీవ్రంగా మదనపడ్డాడు. తన పిల్లలతోనే ఉంటూ భరోసా ఇస్తూ వచ్చాడు.
Crime News:ఇటీవల నాలుగు రోజులుగా ఆ ఇంటి తాళం వేసి ఉన్నది. ఈ విషయం రవిశంకర్ తండ్రి లక్ష్మీపతికి తెలిసి వచ్చి తలుపులు తెరిచి చూశాడు. హిరణ్య, లీలసాయి మంచాలపై విగతజీవులుగా పడి ఉన్నారు. వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు చనిపోయారని ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. రవిశంకర్ కోసం వెతకసాగారు. ఎక్కడా కానరాలేదు.
Crime News:ఈ విషయంపై పోలీసులకు లక్ష్మీపతి ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. రవిశంకర్ చివరి సారిగా మాట్లాడిన ఫోన్ సిగ్నల్స్ కృష్ణా నది ఒడ్డున నమోదైంది. అదే విధంగా రవిశంకర్ తన సన్నిహితులకు రాసిన ఓ సూసైడ్ నోట్ పోలీసులకు చేరింది. దానిలో ఇలా రాసి ఉన్నది. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. నేను జీవితంలో ఏమీ సాధించలేకపోయాను. నా భార్య వెళ్లిపోయినప్పటి నుంచి తనను ఎవరూ ఓదార్చలేదు. అందుకే నేను చనిపోవాలనుకున్న. పిల్లలను చంపి, నేను కూడా చనిపోతున్నా.. అని ఆ సూసైడ్ నోట్‌లో రాసి ఉన్నది.

