Crime News:

Crime News: వృద్ధురాలిని చంపి మృత‌దేహంపై డ్యాన్స్‌.. హైద‌రాబాద్ కుషాయిగూడ‌లో అమానుషం

Crime News: హైద‌రాబాద్ న‌గ‌రంలో రోజురోజుకూ అకృత్యాలు, అమానుష ఘ‌ట‌న‌లు నిత్య‌కృత్య‌మ‌వుతున్నాయి. కొంద‌రు రాక్ష‌స అవ‌తారం ఎత్తి వికృత చ‌ర్య‌ల‌కు దిగుతుండ‌టంతో అన్నెంపున్నెం ఎరుగ‌ని అమాయ‌కులు ఎందురో బ‌ల‌వుతున్నారు. అలాంటి ఘ‌ట‌నే న‌గ‌రంలోని కుషాయిగూడ‌లో చోటుచేసుకున్న‌ది. ఓ వృద్ధురాలిని దారుణంగా చంప‌డ‌మే కాకుండా ఆమె మృత‌దేహంపై నాట్యం చేస్తున్న యువ‌కుడి వీడియో బ‌య‌ట‌కొచ్చింది.

Crime News: కుషాయిగూడ ప్రాంతంలోని కృష్ణ‌న‌గ‌ర్‌లో వృద్ధురాలు క‌మలాదేవి ఒంట‌రిగా నివాసం ఉంటుంది. రాజ‌స్థాన్ నుంచి 15 ఏండ్ల క్రితం న‌గ‌రానికి వ‌చ్చిన ఆమె కుటుంబం ఇక్క‌డే నివాసం ఉంటున్న‌ది. ఆమెకు చెందిన ఓ దుకాణాన్ని ఓ యువ‌కుడు అద్దెకు తీసుకున్నాడు. అద్దె నెల‌నెలా స‌రిగా చెల్లించ‌క‌పోవ‌డంతో ఆమె అత‌డిని మంద‌లించింది. దీంతో ఆ వృద్ధురాలిపై ఆ యువ‌కుడు క‌క్ష‌గ‌ట్టాడు. ఎలాగైనా చంపేయాల‌ని నిశ్చ‌యించుకున్నాడు. స‌మ‌యం కోసం వేచి చూడ‌సాగాడు. ఏప్రిల్ 11న అద్దె కోసం వ‌చ్చిన ఆ వృద్ధురాలిపై ఇనుప రాడ్‌తో దాడి చేసి చంపేశాడు.

Crime News: ఈ స‌మ‌యంలో క‌మలాదేవి మృత‌దేహంపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీశాడు. ఒక నిమిషం వీడియో తీసి స్నేహితుల‌కు పంప‌డంతో అది వైర‌ల్‌గా మారింది. ఆమె ఆ త‌ర్వాత చీర‌తో ఆమె త‌ల‌ను సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడ‌దీస్తూ కూడా వీడియో తీశాడు. ఆ త‌ర్వాత గ‌దిలోప‌ల మృత‌దేహాన్ని ఉంచి బ‌య‌ట తాళం వేసి వెళ్లిపోయాడు.

Crime News: క‌మలాదేవిని హ‌త్య చేసిన విష‌యాన్ని బెంగ‌ళూరులో ఉన్న ఆమె బంధువుకు ఫోన్ చేసి చెప్పాడు. వారు న‌మ్మ‌క‌పోవ‌డంతో డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేయ‌డంతో వారు స్వ‌యంగా వ‌చ్చి త‌లుపు తీసి చూసేస‌రికి దుర్వాస‌న వెద‌జ‌ల్లుతోంది. నిందితుడు రాజ‌స్థాన్‌కు చెందిన కృష్ణ‌పాల్ సింగ్‌గా గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌క పంపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *