Crime News:ఓ మైనర్‌ను స్నేహం పేరుతో మాయమాటలు చెప్పి, ఆమెను బెదిరించి నగ్నంగా వీడియోలు రికార్డు చేసిన ఓ బాలుడు తన స్నేహితులకు పంపాడు. ఆమెను నిత్యం వేధిస్తుండటంతో ఆమె తల్లిదండ్రులకు తెలిసి, పోలీసులను ఆశ్రయించారు. దీంతో వీడియో రికార్డు చేసిన, షేర్ చేసిన స్నేహితులను పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం నమోదు చేశారు.
Crime News:ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు సామాజిక మాధ్యమం ద్వారా 16 ఏళ్ల బాలికకు దగ్గరయ్యాడు. కొంతకాలం పాటు చాటింగ్ చేసుకున్నారు. అయితే దానిని అదనుగా తీసుకున్న ఆ బాలుడు ఆ బాలికను బ్లాక్‌మెయిల్ చేశాడు. తనకు నగ్నంగా వీడియోలు తీసి పంపాలని, లేదంటే చాట్ మొత్తం తన అమ్మానాన్నలకు చూపెడతానని బెదిరించాడు.
Crime News:అతని బెదిరింపులతో భయపడిన ఆ బాలిక ఓ రోజు నగ్నంగా వీడియో కాల్ చేసింది. దానిని ఆ మైనర్ బాలుడు రికార్డు చేశాడు. ఆ వీడియోను తన స్నేహితులకు పంపాడు. అప్పటి నుంచి శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడంతో అసలు విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పుకున్నది.
Crime News:మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో రికార్డు చేసిన బాలుడితో పాటు మరో మైనర్‌ను, వంశీకృష్ణ, పవర్ తరుణ్, గుండల్వార్ వరుణ్, కారడ్ సుధీర్, ముర్కుటే విఠల్, సాబ్లె బాలవంత్ సింగ్ అనే 8 మందిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.