Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకున్నది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఈ జాడ్యం పెరిగిపోతున్నది. క్షణికావేశంతో తమకు పుట్టారనే హక్కుతో అటు తల్లి, ఇటు తండ్రి ఎవరో ఒకరు తమ పిల్లలను సునాయాసంగా చంపేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
Crime News: ఇటీవలే ఏపీలోని వైజాగ్ సమీపంలో తన ఇద్దరు కొడుకులను బకెట్లలోని నీటిలో ముంచి చంపి, తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే తెలంగాణలో ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి ఘోరంగా చంపేసి జైలుపాలయింది. తాజాగా అలాంటి ఘటనలో ఇక్కడా చోటుచేసుకున్నది.
Crime News: సంగారెడ్డి జల్లా కొండాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన సుభాశ్ (42) అనే వ్యక్తికి, తన భార్యతో విభేదాలు పొడచూపాయి. ఈ కారణంతో ఆమె తన భర్తను వదిలేసి, పిల్లలనూ భర్త వద్దే వదిలి వెళ్లిపోయింది. ఎంతకూ రాకపోవడంతో ఆమె భర్త కుమిలిపోయాడు. పిల్లలను వదిలిపోవడాన్ని మనస్తాపంగా భావించాడు.
Crime News: ఈ కారణంగా సోమవారం తన ఇద్దరు పిల్లలైన మారిన్ (13), ఆరాధ్య (10)లకు ఉరేసి చంపేశాడు. ఆ తర్వాత తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకులన్న ఒకే ఒక్క కారణంతో ఆ చిన్నారుల ప్రాణాలు తీసే హక్కు అతనికి లేకున్నా దారుణంగా వారి ప్రాణాలు తీశాడు. ఇలాంటి ఘటలనపై ప్రజల్లో చైతన్యం తేవాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులు, స్వచ్ఛంద సంస్థలపై ఉన్నదని భావిస్తున్నారు.