Crime News: నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ చోటుచేసుకున్నది. ఏటీఎం మిషన్‌లో అమర్చి పెట్టాల్సిన ప్రైవేటు ఏజెన్సీ ఉద్యోగి అ నగదుతో ఉడాయించాడు. విషయం తెలిసిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో అప్రమత్తమై ఆ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఏటీఎంలలో నగదు పెట్టే ఏజెన్సీ డొల్లతనం బయటపడింది.
Crime News: నిజామాబాద్ జిల్లాలోని ఏటీఎం మిషన్లలో నగదు పెట్టే ఓ క్యాష్ ఏజెన్సీకి హైదరాబాద్ నుంచి నగదు వచ్చింది. ఆర్మూరు, నిజామాబాద్ ఏరియాలకు వాహనాలలో నగదు పంపించారు. బోధన్ ప్రాంతానికి నగదును చేరవేయాల్సిన రమాకాంత్ అక్కడికి చేరుకున్నాడు. ఎల్లమ్మగుట్టలోని వారి కార్యాలయంలో ఎవరూ లేరన్న విషయం తెలుసుకొని, నగదు ఉన్న బ్యాగ్‌ను అపహరించి బైక్‌పై పెట్టకొని పత్తాలేకుండా పోయాడు.
Crime News: ఏటీఎం యంత్రాలలో పెట్టాల్సిన రూ.40.50 లక్షల నగదు రమాకాంత్ తీసుకెళ్లాడని సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నాలుగోటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.