Naga Chaitanya: తండేల్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాగ చైతన్య అతి త్వరలోనే తన నెక్ట్స్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమాను విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తన కెరీర్లో 24వ మూవీగా తెరకెక్కుతుంది.తాజా సమాచారం ప్రకారం NC24 ప్రీ ప్రొడక్షన్ చివరి దశకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ నెలాఖరు నుంచి సినిమా పట్టాలెక్కబోతున్నట్టు సమాచారం. తండేల్ సినిమాతో ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న చైతన్యకు ఈ సినిమాతో ఆ క్రేజ్ మరింత పెరగడం ఖాయమనిపిస్తుంది. ఇక NC24 మిస్టిక్ హార్రర్ థ్రిల్లర్ జానర్ లో రూపొందనుంది.కార్తీక్ దండు ఈ సినిమాలో ఓ కొత్త ప్రపంచాన్ని చూపించనున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Crime News: అయ్యో పాపం.. నూడుల్స్ కోసం అడిగినందుకు 14 ఏళ్ల పిల్లాడిని చంపేశారు!
దాని కోసం ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇప్పటికే స్పెషల్ సెట్స్ ను కూడా నిర్మిస్తున్నాడట. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.
బుజ్జి తల్లి వీడియో సాంగ్ | తాండల్ | నాగ చైతన్య, సాయి పల్లవి | జావేద్ అలీ | దేవి శ్రీ ప్రసాద్: