Mahaa Bhakti: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన లిప్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ మహా గ్రూప్ చెర్మెన్ మారేలా వంశీ కృష్ణకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు. మహా న్యూస్ మరో ముందు అడుగు వేస్తూ నూతనంగా మహా భక్తి ఛానల్ ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా . లిఫ్ట్ ఆర్టిస్ట్ గుండు శివ కుమార్ ..రావి ఆకుపై ….భక్తి ఛానల్ లోగోను చిత్రీకరించి మహా గ్రూప్ యజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మహా భక్తి ఛానల్ ప్రారంభించడానికి విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మహా న్యూస్ చైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ చిత్రాలను రావి ఆకుపై చిత్రకరించి వినూత్నంగా శుభకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుండు శివకుమార్ మాట్లాడుతూ..మహా న్యూస్ గ్రూప్ ఛైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ మరిన్ని కొత్త ఛానల్తో ప్రజలకు సమాచార వారధిగా ఉండాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా మహా భక్తి ఛానల్ ద్వారా ప్రజలకు సనాతన ధర్మం, విశిష్టతను పురాతన ఆలయాల గురించి ప్రస్తుత తరాలకు ఉపయోగ పడే విధంగా ముందుగు సాగాలని అన్నారు.