ఎయిర్ షోలో జరిగిన ప్రమాదం స్పందించారు తమిళనాడు సీఎం స్టాలిన్. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. వైమానిక దళం కోరిన దాని కంటే మించిన ఏర్పాట్లను అధికారులు చేశారని చెప్పారు.
అయితే ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చారని అన్నారు. ఎయిర్ షో తర్వాత ప్రజలు తిరిగి వెళ్లేటప్పుడు తమ వాహనాలను, పబ్లిక్ రవాణాను చేరుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా తనకు తెలిసిందని సీఎం స్టాలిన్ అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పెద్ద ఈవెంట్లు జరిగినప్పుడు ఈ అంశాలపై మరింత శ్రద్ధ చూపుతామని, ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.