cm revanthreddy:తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తన సొంతూరికి నిధుల వరద పారించారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని పూర్తవగా, మరికొన్ని పనులకు శ్రీకారం చుట్టారు. అందురు సీఎంల మాదిరిగానే ఆయన కూడా తన జన్మనిచ్చిన ఊరి అభివృద్ధికి విశేష నిధులు కేటాయించడం గమనార్హం. దీంతో నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి మహర్దశ పట్టుకున్నది. గ్రామస్థుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
cm revanthreddy:సీఎం అయ్యాక తొలిసారి రేవంత్‌రెడ్డి తన సొంతూరు కొండారెడ్డి పల్లిలో దసరా పర్వదినాన్ని జరుపుకున్నారు. ఘనస్వాగతం పలికిన గ్రామస్థులతో కలిసి ముఖ్యమంత్రి పండుగ చేసుకున్నారు. దీంతో గ్రామంలో సందడి వాతావారణం నెలకొన్నది. ఈ సందర్భంగా గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించగా, చేయాల్సిన వాటికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకే ఈ చర్యలు చేపట్టినట్టు సీఎం ప్రకటించారు.
cm revanthreddy:తనను ఇంతవాన్ని చేసిన ఊరికి ఏదో ఒకటి చేయాలన్న తపన తనకు ఉన్నదని, అందుకే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు సీఎం చెప్పుకొచ్చారు. ఇప్పటికే కొండారెడ్డిపల్లి గ్రామంలో రూ.55 లక్షలతో నిర్మించిన మోడల్ గ్రంథాలయం, రూ.70 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనం, రూ.72 లక్షలతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
cm revanthreddy:అదే విధంగా రూ.64 లక్షలతో నిర్మించనున్న బస్టాండ్, విద్యుద్దీపాల పనులు, రూ.18 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సీసీరోడ్ల నిర్మాణ పనులు, రూ.32 లక్షలతో నిర్మించనున్న చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
cm revanthreddy:తన కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపిన సీఎం రేవంత్‌రెడ్డి.. గ్రామస్థులతో కలిసి కాలినడక గ్రామంలో పర్యటించారు. అనంతరం దసరా వేదిక వద్ద టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఆ ఊరి మహిళలు బతుకమ్మలు ఆడిపాడారు.