Revanth Reddy

Revanth Reddy: మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి..!

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత పార్టీ మంత్రులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.

జిల్లాలపై బాధ్యత వహించే ఇన్‌ఛార్జి మంత్రులు సరైన విధంగా పని చేయడం లేదని, ఇది సరైన పద్ధతి కాదని తీవ్రంగా విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత మొత్తం మంత్రులదేనని, నిధులు, అధికారాలన్నీ వారి చేతిలోనే ఉన్నాయని గుర్తు చేశారు. అయినా నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

“పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపరచకండి. వారికి న్యాయం చేయాలి. జిల్లాల్లో వెంటనే ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయండి,” అంటూ మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు.

ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై కూడా సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. అభ్యర్థి ఎంపిక అధిష్టానమే నిర్ణయిస్తుందని, ఎవరికీ తాము అభ్యర్థినని చెప్పుకునే హక్కు లేదన్నారు. పార్టీ క్రమశిక్షణకు ఇది పరపతికరంగా ఉండదని, అందరూ నిబంధనలు పాటించాలన్నారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy: కాంగ్రెస్ నేతలకు CM రేవంత్ రెడ్డి కీలక సూచన

మంత్రి పదవుల కోసం కొంతమంది నేతలు ధర్నాలు చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “పదవి అడగొచ్చు కానీ రోడ్డెక్కి డిమాండ్ చేయడం సరికాదు. ఇవాళ ఒకరు చేస్తే రేపు ఇంకొకరు చేస్తారు. ఇది పార్టీకి మంచిది కాదు” అని అన్నారు.

అలాగే, పీసీసీ కమిటీలో పని చేస్తున్న నేతలపై సమీక్ష జరిపేలా సూచించారు. “పని చేసిన వాళ్ల జాబితా వేరుగా, పని చేయని వాళ్ల జాబితా వేరుగా సిద్ధం చేయండి. పనితీరును బట్టి ప్రమోషన్ లేదా డిమోషన్ తీసుకుంటాం. మొహమాటం అవసరం లేదు,” అని స్పష్టం చేశారు.

ఇటువంటి వ్యాఖ్యలతో సీఎం రేవంత్ పార్టీ లోపల క్రమశిక్షణను పాటించేందుకు, నేతలు తమ బాధ్యతలు సరిగా నిర్వర్తించేందుకు గట్టి హెచ్చరికను ఇచ్చినట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  shyamala: ఇక నుంచి బాధ్యత గల పౌరిరాలిగా ఉంటాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *