కేసీఆర్ ఎక్స్‌పైరీ మెడిసిన్ .. ఆయన రాజకీయం ఏడాదిలో ముగుస్తుందని ఆపై కేసీఆర్ అనే పదమే కనిపించదని సీఎం రేవంత్ సంచలన కామెంట్స్ చేశారు. ‘ఆయన ఫ్యామిలీలో గొడవలు నడుస్తాయి. బావతో బావమరిది రాజకీయం ముగుస్తుంది. కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్ ను వాడాను. త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా బావ హరీశ్‌ను వాడతాను. ఇద్దరినీ ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. రాజ్‌పాకాల ఇంట్లో క్యాసినో కాయిన్స్ దొరికాయి. దీపావళి పార్టీ అని ఎలా అంటారు?’ అని సీఎం ప్రశ్నించారు.
మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు నవంబర్ 1న ప్రారంభిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ‘నవంబర్‌లోపు టెండర్లు పిలుస్తాం. మూసీపై ముందడుగే తప్ప వెనకడుగు వేయం. మొదటి విడతలో బాపూఘాట్ నుంచి 30 కి.మీ మేర పనులు చేపడతాం. ఇప్పటికే రూ.140 కోట్లతో DPR తయారీకి ఆదేశాలిచ్చాం. నిర్వాసితులకు ఫ్రీ ఎడ్యుకేషన్, అన్ని సదుపాయాలు కల్పిస్తాం. మూసీ చుట్టూ నైట్ సిటీ ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.
మూసీపై ముందడుగే.. వెనకడుగు లేదని.. ఎవరు అడ్డుకున్న మూసి పునరుజ్జీవం చేసి తీరుతామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. మొదటి ఫేస్ 21 కిలో మీటర్ల వరకు అభివృద్ధి చేస్తాం. గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మొదటి ఫేస్ పనులు చేపడతాం. నెల రోజుల్లో డిజైన్లు పూర్తవుతాయి. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తాం. దీనికి సంబంధించి ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తాం.’’ అని రేవంత్ తెలిపారు.