CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనవరి 16 నుంచి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన సింగపూర్, దావోస్ నగరాల్లో పర్యటించనున్నారు. వాస్తవంగా జనవరి 14 నుంచే ఆయన ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉన్నది. అయితే ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవాలు ఉండటంతో ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే సింగపూర్, దావోస్ పర్యటన ఖరారైనందున ఆయన 16వ తేదీనే బయలుదేరి వెళ్లనున్నారు.
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య నేతలతో కలిసి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అక్కడ ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ మేరకు ఢిల్లీ నుంచే జనవరి 16న సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. జనవరి 16 నుంచి 19 వరకు సింగపూర్‌లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. ఆ తర్వాత 20 నుంచి 22 వరకు దావోస్ నగరంలో జరిగే ప్రపంచ సదస్సుల్లో పాల్గొంటారు.
CM Revanth Reddy: పెట్టుబడల విషయమై ఆయన సింగపూర్, దావోస్‌లో పర్యటించేందుకు వెళ్తున్నారు. గతేడాది దావోస్‌లో జరిగిన వరల్డ ఎకనామిక్ ఫోరం సదస్సుల్లో చేసుకున్న ఒప్పందాలతో రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, 14 కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయి. వీటిలో 17 ప్రాజెక్టులు దాదాపు ప్రారంభమయ్యాయయని అధికారులు తెలిపారు. 10 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఈసారి గత ప్రాజెక్టుల పురోగతి, ఇతర ప్రాజెక్టుల ఆకర్షణపై సీఎం దృష్టి సారించనున్నారు.
CM Revanth Reddy: ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్‌లో సీఎం పర్యటిస్తారు. అక్కడి స్కిల్ వర్సిటీతో ఒప్పందాలు చేసుకోనున్నారు. దాంతోపాటు వివిధ పెట్టుబడులకు సంబంధించి ఇతర ఒప్పందాలు, సంప్రదింపులు జరపనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంట మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్‌పై ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితమే సమీక్షించారు.