CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకే ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై వారితో చర్చించనున్నారని తెలిసింది. డిసెంబర్ నెలలో నిర్వహించే ప్రజా ఉత్సవాలకు హాజరుకావాలని ముఖ్యనేతలను ఆహ్వానిస్తారని సమాచారం. ఇదే సందర్భంగా సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సభకు హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని సీఎం రేవంత్‌రెడ్డి కోరనున్నట్టు తెలిసింది.
CM Revanth Reddy: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల ఎంపిక విషయంపైనా సీఎం రేవంత్‌రెడ్డి.. అధిష్ఠానం పెద్దలతో చర్చిస్తారని తెలిసింది. ఇప్పటికే పలుమార్లు చర్చించిన ఆయన ఈసారి ఫైనల్ జాబితాను సిద్ధంచేసే వస్తారని ప్రచారం జరుగుతున్నది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావహులు దీనిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.