cm revanth reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చర్చిస్తూ, ఉద్యోగ సంఘాలపై తీవ్ర విమర్శలు చేశారు. “నన్ను కోసినా నెలకు రూ. 18,500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది,” అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఉద్యోగ సంఘాలు పోరాటం ప్రకటించడం పై అసహనం వ్యక్తం చేశారు. “మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారా? మీకు బాధ్యత లేదా?” అని ఉద్యోగ సంఘాల నాయకులను ప్రశ్నించారు.
పెట్రోల్ ధరలు రూ. 100 నుంచి రూ. 200, బియ్యం ధర రూ. 30 నుండి రూ. 60 పెంచాలని ఉద్యోగ సంఘాలు చెప్పడంపై ఆయన స్పందించారు. “బోనస్‌లు, జీతాల పెంపు ఎలా చేయాలో ఉద్యోగ సంఘాలే చెప్పాలి,” అని ఆయన అభిప్రాయపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తప్పుపట్టిన రేవంత్, “కేసీఆర్ 11 శాతం అప్పు తీసుకుని రాష్ట్రాన్ని దివాళా తీయించి ఫామ్‌హౌస్‌లో పడుకున్నాడు,” అని విమర్శించారు. “16 నెలల కాలంలో రూ. 1.58 లక్షల కోట్ల అప్పు తీసుకున్న మా ప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు,” అని ఆయన తెలిపారు. “ఇప్పుడు నెలకు రూ. 7 వేల కోట్ల అసలు, వడ్డీ చెల్లించాల్సి ఉంది,” అని పేర్కొన్నారు.
