Cm revanth : “హైదరాబాద్ నగర అభివృద్ధికి పీజేఆర్ (పి.జానారెడ్డి) చేసిన కృషి మరువలేనిది” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకప్పుడు పీజేఆర్ నివాసం జనతా గ్యారేజీలా ఉండేదని, జంట నగరాల సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతో శ్రమించారని సీఎం గుర్తు చేశారు. పీజేఆర్ నడిపించిన పోరాటాలతోనే నగర ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందించగలిగామని పేర్కొన్నారు.
హైటెక్ సిటీ అభివృద్ధికి సంబంధించిన వివరాలు వెల్లడించిన సీఎం, “పీజేఆర్ నేతృత్వంలోనే హైటెక్ సిటీకి పునాది పడింది. తొలుత రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ పేరిట ప్రారంభమైన ఈ ప్రాంతాన్ని చంద్రబాబు హైటెక్ సిటీగా అభివృద్ధి చేశారు. వాజ్‌పేయీ, పీవీ నరసింహారావుల సహకారంతోనే ఐటీ కారిడార్ విస్తరించింది” అని తెలిపారు.
అభివృద్ధిపై అడ్డంకులపై స్పందించిన రేవంత్, “ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలి. ప్రస్తుతం అభివృద్ధిే లక్ష్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కానీ కొందరు రాజకీయ ముసుగులో కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అలాంటి వారిని ప్రజలు క్షమించరని, ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే వారు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని” ధ్వజమెత్తారు. హైదరాబాద్లో మరో ఐటీ పార్క్ కట్టి డెవలప్ చేస్తామని చెప్పారు. నాగార్జున రెండు ఎకరాల భూమి ఇచ్చారని చెప్పారు.