Cm revanth: మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సందర్శించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బాధితులు సీఎంకు వినతిపత్రాలు అందజేశారు.
తర్వాత హన్మకొండ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం మాట్లాడుతూక్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి స్థాయి నష్టం అంచనా వేయాలని ఆదేశించారు.
ప్రాణ నష్టం, పంట నష్టం, పశుసంపద, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా అన్ని రంగాలకు సంబంధించిన నివేదికలు సమగ్రంగా తయారు చేయాలని అధికారులకు సూచించారు.ఈ ప్రక్రియలో ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని చెప్పారు
12 జిల్లాల్లో తీవ్ర నష్టం సంభవించిన నేపథ్యంలో—కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తప్పక రాబట్టాలని అన్నారు.తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారాల దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం లోపం ఉన్నందున సమస్యలు పెరుగుతున్నాయని, అన్ని విభాగాలు కలసి పని చేయాలని ఆదేశించారు.
నదుల, నాలాల కబ్జాలను ఖచ్చితంగా తొలగించాలని, ఎంత ప్రభావవంతులైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
“కొద్ది మంది కోసం వేల మందికి నష్టం జరగకూడదు” అన్నారు.
ప్రభుత్వ చర్యలు:
వరదలు తగ్గిన వెంటనే శానిటేషన్ పనులు వేగవంతం చేయాలి.
ప్రాణనష్టం జరిగిన వారికి ₹5 లక్షల పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమని తెలిపారు.
పంట నష్టం, పశుసంపద నష్టం జరిగిన వారికి వెంటనే సహాయం అందించాలి.
ఇసుక మట్టితో నష్టపోయిన రైతులకు సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


