అలయ్ బలయ్ అంటే బండారు దత్తాత్రేయ గుర్తుకువస్తారని సీఎం రేవంత్ రెడ్ది అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో అలయ్ బలయ్ స్ఫూర్తి నింపిందని చెప్పారు.
ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్‌యూ, కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకు అందరూ ఒక్కటై తెలంగాణ కోసం గళం వినిపించారని చెప్పారు.19 ఏళ్లుగా దత్తాత్రేయ అలయ్ బలయ్ నిర్వహిస్తూ తెలంగాణ కళలను భావితరాలకు అందిస్తున్నారని చెప్పారు.
అలయ్ బలయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నుంచి ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి వారసత్వంగా తీసుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సంప్రదాయం తప్ప, రాజకీయాలతో సంబంధం లేదని తెలిపారు.కుల, మత, పార్టీలకతీతంగా అందరం ఈ కార్యక్రమంలో ప్రతి ఏటా పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.