cm convoy: మధ్యప్రదేశ్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాన్వాయ్‌కు చెందిన మొత్తం 19 కార్లు రోడ్డుమధ్యలో బ్రేక్‌డౌన్ అయ్యాయి. మొదట్లో సాధారణ యాంత్రిక లోపంగా భావించినా, విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. పోలీసుల విచారణలో పెట్రోల్ బంక్ సిబ్బంది నిర్లక్ష్యం, మరింతగా చెప్పాలంటే డీజిల్‌లో నీళ్లు కలిపి వాహనాల్లో నింపిన ఘటన బయటపడింది.
also read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. విశేష ఉత్సవాల తేదీలను ప్రకటించిన టీటిడీ
ఈ ఘటనపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంబంధిత పెట్రోల్ బంక్‌ను పోలీసులు సీజ్ చేశారు. బంక్ నిర్వాహకులు, సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంధన కల్తీ వల్ల ప్రయాణికులు, వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరల జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.