రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు.ఆకస్మిక వరదలకు అవకాశం ఉన్నందున యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఇక భారీ వర్షాల కారణంగా జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో అధికారులు కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేశారు.
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం రన్‌వేపైకి భారీగా నీరు చేరింది. దీంతో ల్యాండింగ్ సమస్య తలెత్తడంతో ఇండిగో ఫ్లైట్‌ను చెన్నైకి దారి మళ్లించారు.
