Mahanadu 2025: కడప గడ్డపై ఘనంగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఉత్సాహాన్ని నింపింది. ఈ వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తల్లో నూతన జోష్ నింపుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ విజయం వెనుక కార్యకర్తల త్యాగాలు, పోరాటాలు ఉన్నాయని కొనియాడారు.
93 శాతం స్ట్రైక్ రేట్ – పార్టీ శ్రేయస్సు సంకేతం
2024 ఎన్నికల్లో టీడీపీ సాధించిన విజయంపై చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ – ‘‘93 శాతం స్ట్రైక్ రేట్‌తో పాటు 57 శాతం ఓట్లను అందుకున్నాం. ఇది కార్యకర్తల కృషికి తగిన ప్రతిఫలం. ఇంకొంచెం కష్టపడితే వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో విజయం సాధించవచ్చు’’ అని ధీమా వ్యక్తం చేశారు.
కార్యకర్తల త్యాగాల వల్లే అధికారంలోకి టీడీపీ
‘‘పార్టీ కార్యకర్తల పోరాటం చరిత్రలో నిలిచిపోయే విధంగా సాగింది. అక్రమ కేసులు, వేధింపులు, అరెస్టులతో ఎన్నో కష్టాలు పడ్డా.. వెనక్కి తగలలేదు. ఎంతోమంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాలను వృథా కానివ్వం’’ అని పేర్కొన్నారు.
కడపలో తొలి మహానాడు – ప్రత్యేకమైన ఘట్టం
‘‘ఇది దేవునిగడప కడపలో జరుగుతున్న తొలి మహానాడు. ఇది రాష్ట్ర దిశ, దశలను నిర్దేశిస్తున్న వేడుక. ఇలాంటి సమ్మేళనాలు రాష్ట్రానికి బలాన్ని ఇస్తాయి. కడప జిల్లాలో 10 స్థానాల్లో 7 గెలిచి సత్తా చాటాం’’ అని చంద్రబాబు తెలిపారు.
Also Read: Chandrababu: TDP: మహానాడు ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న చంద్రబాబు
టీడీపీ లక్ష్యం – అన్ని వర్గాల అభివృద్ధి
తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పని చేస్తుంది. బీసీలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించాం. పటేల్-పట్వారీ వ్యవస్థను రద్దు చేశాం. సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైంది. అవినీతి రహిత పాలనను అందిస్తున్నాం అని స్పష్టం చేశారు.
గతంలో అధికారాన్ని వేధింపుల కోసం వాడారు. పౌరుల గొంతులను అణిచేశారు. రాష్ట్రాన్ని విధ్వంసానికి గురిచేశారు. ఇప్పుడేమీ అలాంటి పరిస్థితులు లేవు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలుస్తున్నాం. జవాబుదారీ పాలనకు టీడీపీ మోడల్ అన్నారు.