Citadel: హాలీవుడ్ వెబ్ సీరిస్ ‘సిటాడెల్’ ఇండియన్ వర్షన్ ఇక్కడ మంచి విజయాన్ని అందుకుంది. అందులో కీలక పాత్రలు పోషించిన వరుణ్ ధావన్, సమంతకు చక్కని గుర్తింపు తెచ్చిపెట్టింది. యాక్షన్ హీరోయిన్ గా ఈ వెబ్ సీరిస్ తో సమంత పేరు తెచ్చుకుంది. దాదాపు 170 దేశాలలోని ప్రేక్షకులు దీనిని చూశారు. చాలా దేశాలలో కొన్ని వారాల పాటు ఇది ట్రెండింగ్ లో ఉంది. విశేషం ఏమంటే ‘సిటాడెల్’ వెబ్ సీరిస్ నాన్ ఇంగ్లీష్ ఒరిజినల్ జాబితాలో గ్లోబల్ ర్యాంకింగ్ లో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. ఇంగ్లీష్ లో ఈ వెబ్ సీరిస్ మాతృకను చూసిన వారు సైతం హిందీలో దీనిని ఎలా తీశారో తెలుసుకోవాలనే ఆసక్తితో చూసినట్టు అర్థమౌతోంది. నిజానికి హిందీతో పాటు కొరియన్, స్పానిష్ భాషల్లోనూ పలు వెబ్ సీరిస్ లు తెరకెక్కుతూ ఉంటాయి. వాటిని వెనక్కి నెట్టి ‘సిటాడెల్’ టాప్ పొజిషన్ కు చేరడం గొప్ప విషయమే. ‘సిటాడెల్’తో పాటు బూతు వెబ్ సీరిస్ గా పేరు తెచ్చుకున్న ‘మిర్జాపూర్ -3’కి కూడా టాప్ టెన్ లో చోటు దక్కింది.
