Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం గురించి అభిమానుల్లో హైప్ ఓ రేంజ్‌లో ఉంది. చిరంజీవి స్టైల్‌లో కామెడీ యాంగిల్‌ని ఫుల్ డోస్‌లో అందించే ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఘనంగా ప్రారంభమైంది.
మొదటి షెడ్యూల్‌ని సూపర్ స్పీడ్‌లో పూర్తి చేసిన అనీల్ టీమ్, ఒక రోజు ముందుగానే ప్యాకప్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వేగం, పర్ఫెక్షన్ చూస్తే.. ఈ సినిమా ఎంత జోష్‌గా తెరకెక్కుతుందో అర్థమవుతోంది.ఇప్పటికే రెండో షెడ్యూల్‌కి సన్నాహాలు షురూ అయ్యాయని సమాచారం.
Also Read: Vicky Kaushal: మరో లెజెండ్ బయోపిక్ లో విక్కీ కౌశల్?
Chiranjeevi: అనీల్ రావిపూడి మార్క్ కామెడీతో మెగాస్టార్ మ్యాజిక్‌ని మిక్స్ చేస్తూ, ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయమని టాక్. అభిమానులకు ఈ మూవీ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ కానుంది. ఈ సంక్రాంతి సీజన్‌లో చిరు సినిమాతో సందడి డబుల్ అవ్వనుంది.