Chikkadpally Police Station: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు అరెస్టు చేసి, సినీ నటుడు అల్లు అర్జున్‌ను విచారిస్తున్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు ప్రముఖులు బాటపట్టారు. పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున అరెస్టు వార్త తెలుసుకొన్న ఆయన అభిమానులు కూడా భారీగా చేరుకున్నారు. అయితే ప్రముఖుల రాకను మాత్రం పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎవరినీ అనుమతించడం లేదు.
Chikkadpally Police Station: అల్లు అర్జున్ అరెస్టు వార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవి తన సినిమా షూటింగ్‌ను ముగించుకొని చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన పోలీసు అధికారులు ఆయనను రావద్దని వేడుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని భావించిన చిరంజీవిని రావద్దని కోరారు. ఇప్పటికే ప్రముఖ సినీ నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు.
Chikkadpally Police Station: అదే విధంగా అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అల్లు అర్జున్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదవడంతో పాటు 105, 118(1) ఆర్/డబ్ల్యూ3(5) బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. దీంతో బెయిల్ వస్తుందా? రాదా? అన్న ఆందోళన పలువురిలో నెలకొన్నది.