Chandrababu Naidu: నేడు కొవ్వూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి ఉదయం 10 30 కు చేరుకుంటారు సీఎం. ఉదయం 10.30 నుంచి 10.35 వరకు హెలిప్యాడ్ వద్ద ప్రముఖులు స్వాగతం పలుకుతారు. రోడ్డు మార్గం ద్వారా 10.35 కి బయలు దేరి 10.45 కి మలకపల్లి గ్రామానికి చేరుకోనున్నారు. ఉదయం 10.45 నుంచి ఉ.11.05 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేస్తారు. ఉ.11.10 కి గ్రామ సభ ప్రజా వేదిక కు చేరుకుంటారు. ఉ.11.10 నుంచి మ.12.40 వరకు గ్రామ సభలో పాల్గొని లబ్దిదారులతో ముఖాముఖి కార్యక్రమం లో పాల్గొనడం జరుగుతుంది. మ .12.50 కు కొవ్వూరు మండలం కాపవరం ఏ.ఎమ్.సి. కి చేరుకుంటారు. మ.1.30 నుంచి మ.3.00 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. రోడ్డు మార్గంలో బయలుదేరి సా.3.30 కు రాజమండ్రి ఎయిర్ పోర్టు కు చేరుకుంటారు. సా.3.30 నుంచి సా.3.40 వరకు ముఖ్యమంత్రికి వీడ్కోలు కార్యక్రమం , అనంతరం బెంగుళూరు బయలుదేరి వెళ్లనునున్నారు సీఎం.
ఇది కూడా చదవండి: Transgender: ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్..రెండు నెలలపాటు ఉచితంగా కుట్టు శిక్షణ

