Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అడవులను స్థావరంగా మార్చుకున్న మావోయిస్టుల పరిస్థితి ప్రస్తుతం అనుకూలంగా లేకుండా మారుతోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను భద్రతా బలగాలు సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాయి. డ్రోన్ల సాయంతో నక్సలైట్ స్థావరాలను సులభంగా గుర్తించి దాడులు నిర్వహించడం ద్వారా భద్రతా బలగాలు అధిక విజయాలు సాధిస్తున్నాయి.
మావోయిస్టులపై భద్రతా బలగాల దాడులు
తాజాగా, బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లోని భట్టిగూడ అడవుల్లో మావోయిస్టుల శిక్షణ శిబిరాన్ని కోబ్రా బెటాలియన్ జవాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.ఆ శిబిరం ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్‌ను తలపించే విధంగా నిర్మించబడింది.
దట్టమైన అడవుల మధ్య పెద్ద విస్తీర్ణంలో నిర్మించిన ఈ శిబిరంలో భవనాలు, షెడ్లు, మరియు శిక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
ఒకేసారి పెద్ద సంఖ్యలో మావోయిస్టులకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు ఉండటం గుర్తించబడింది.
శిబిరం ధ్వంసం
కోబ్రా బెటాలియన్ జవాన్లు శిక్షణ శిబిరాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్న డిటొనేటర్లతో శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు.
ఎన్‌కౌంటర్‌లు.. పెరుగుతున్న మరణాలు
ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రతి ఎన్‌కౌంటర్‌లోనూ మావోయిస్టులు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. భద్రతా బలగాల పెరిగిన దాడుల తీరుతో మావోయిస్టుల పరిస్థితి మరింత కఠినంగా మారుతోంది.
ఈ పరిణామాలు మావోయిస్టుల స్థావరాలను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి భద్రతా బలగాలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్టు స్పష్టమవుతోంది.