Chhaava: ఛత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది ‘ఛావా’ చిత్రం. విక్కీ కౌశల్, రశ్మిక మందణ్ణ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా ఔరంగజేబు పాత్రను పోషించాడు. ఈ చారిత్రక చిత్రానికి ఎ.ఆర్. రహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 6న విడుదల కావాల్సిన ఈ సినిమాను జనవరి 10కి వాయిదా వేశారనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. అయితే ఇప్పుడు దీనిని ఫిబ్రవరి 19న శివాజీ జయంతి సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ‘పుష్ప -2’తోనూ, ‘గేమ్ ఛేంజర్’తోనూ పోటీ పడాల్సిన ‘ఛావా’ సైలెంట్ గా ఫిబ్రవరి ద్వితీయార్థానికి వెళ్ళిపోయింది.