Suicide

Suicide: ఆత్మహత్య ఆలోచనలకు ఇలా చెక్ పెట్టండి!

Suicide: ఈ మధ్య చాలా మంది  చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంత మంది ఉద్యోగ ఒత్తిడిలతో, మరికొంతంది కుటుంబ ఇబ్బందులతో జీవితాలను బలి చేసుకుంటున్నారు. మానసికంగా బలహీనంగా ఉండడమే ఇలాంటి ఆలోచనలకు దారితీస్తుంది.  సైకాలజిస్ట్ అభిప్రాయం ప్రకారం.. ఆత్మహత్య ఆలోచనలు బైపోలార్ డిజార్డర్‌ను సూచిస్తాయి. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడేవారు దీన్ని ఎక్కువగా ఎదుర్కొంటారు. అయితే నిపుణులు  ఆత్మహత్య ఆలోచనలను నియంత్రించడానికి కోన్ని సూచనలను చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒత్తిడి కారణంగా మనిషి భారంగా, నిరాశగా ఫీలవుతారు. ఎప్పుడు మనసులో ఏదో ఆందోళన, ఒత్తిడి, భయం వెంటాడుతూ ఉంటాయి. ఇది కొంతమందిలో చనిపోవాలనే ఆలోచనలను కలిగిస్తుంది.ఇలాంటి సంకేతాలను గుర్తిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. మనసులో నెగటివ్ ఆలోచనలు రాకుండా.. సన్నిహితులతో కూర్చొని మాట్లాడండి. సమస్యలతో విసుగు చెందకుండా ఇతరుల సలహాతో వాటిని పరిష్కరించుకోండి.

Also Read: Sunscreen: సన్‌స్క్రీన్ కొనేటప్పుడు ఏ విషయాలు గమనించాలి? తెలుసుకోండి!

బాధను ఇతరులతో పంచుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు సమస్యలకు పరిష్కారాలను కూడా అందిస్తుంది. అందరితో కలిసి మెలిసి సంతోషంగా జీవనం కొనసాగించే వారిలో వ్యక్తులకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చే అవకాశం తక్కువ. మనసులో పదే పదే మనసులో ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే వెంటనే  సైకాలజిస్ట్‌ని కలవండి. అలా అనిపించడానికి కారణాలేంటో తెలుసుకోండి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *