Chandrababu: ఏపీ రాజధాని అమరావతి పనులు 2014-2019 టీడీపీ హాయాంలో ప్రారంభ అయ్యాయి. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక.ఏపీకి మూడు రాజధానులు అంటూ… వైజాగ్ పరిపాలన రాజధాని అనడంతో అమరావతిలో పనులు అన్ని ఎక్కడవి అక్కడే నిలిచిపోయాయి.గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజధాని పనులు ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్నట్లుగా నిలిచిపోయాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరాలా అమరావతికి పూర్వవైభవం కళ కనపడుతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచింది. ప్రభుత్వ భవనాల పనులు, ల్యాండ్ పూలింగ్ పనులు, ప్రైవేట్, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన పనులను ఎప్పటిలోగా పూర్తి చేయాలన్న దానిపై సిఆర్డియో యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది.వచ్చే డిసెంబర్ 15 నుంచి దశల వారిగా పనులు ఎప్పుడు ప్రారంభించి… ఎప్పటిలోగా పూర్తి చేయాలన్నదానిపై సిఆర్డియో క్లారిటి ఇచ్చింది.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత అధికారులు అపార్ట్‌మెంట్ల నిర్మాణ అంచానా వ్యయం 700 కోట్లు కాగా ఇప్పటి వరకు 80 శాతం పనులు ఇప్పటికే పూర్తి కాగా… మిగిలిన 20 శాతం పనులు వచ్చే నెల 15 ప్రారంభించి వచ్చే 6 నెలల్లోగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు
ఇది కూడా చదవండి: Jagan: నేను “అతి” మంచోడిని …జగన్ స్టేట్మెంట్
Chandrababu: జారీ చేసింది. ఎన్జీవో అపార్ట్మెంట్లు 1355 కోట్లు వ్యయం కాగా… ఇప్పటి వరకు 522 కోట్ల రుపాయిలు మేర ఖర్చు చేయగా 62 శాతం పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు మిగిలిన 28 శాతం పనులు డిసెంబర్ 15 ప్రారంభించి… 9 నెలలోగా పూర్తి చేయాలని సిఆర్డియో టార్గెట్ పెట్టింది. మిగిలిన పనులు వచ్చే నెల 15 నుంచి ప్రారంభించి, 9 నెలలోగా పూర్తి చేయనున్నారు. మిగిలిన పనులు 2 ఏళ్లలో పూర్తి చేయనున్నారు.
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే… అత్యంత కీలకమైన నూతన సచివాలయం ఐదు టవర్స్‌గా పనులు ప్రారంభించింది. ఇందులో జీఏడి టవర్ 662 కోట్ల రుపాయిలు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించగా…53 కోట్ల రుపాయిలు వ్యయం చేయగా.కేవలం 13 శాతం పనులే పూర్తి అయ్యాయి. మిగిలిన పనులు వచ్చే 30 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తోంది. మిగిలిన జీఏడి నాలుగు టవర్ల నిర్మాణ వ్యయం 2041 కోట్ల రుపాయిలు కాగా… 117 కోట్ల రుపాయిలు మేర ఖర్చు చేయగా.మిగిలిన పనులు వచ్చే 30 నెలల్లో పూర్తి చేయాలని సిఆర్డియో భావిస్తోంది. ఇక ఐకానిక్ భవనంగా నిర్మించే అసెంబ్లీ భవనం అంచనా వ్యయం 555 కోట్లు రుపాయిలతో పనులు వచ్చే జనవరి 30న ప్రారంభించి… 30 నెలల్లో పూర్తి చేయాలని సిఆర్డియో టార్గెట్ ఫిక్స్ చేసింది.
ఇక రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ విధానంతో భూములు ఇచ్చిన రైతులుకు తిరిగి ఇచ్చే ఫ్లాట్లులో మౌళిక వసతులు జోన్ 1,2,3,4,5,6 పనులు డిసెంబర్ 15 నుంచి ప్రారంభించి… 24 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యం కాగా… మిగిలిన జోన్. .7,8,9,10,11,12,12A పనులు వచ్చే డిసెంబర్ 20న ప్రారంభించి.24 నాలుగు నెల్లలో సిఆర్డియో నిర్ధిష్టమైన టైమ్ లైన్ విధించింది. మొత్తంగా వచ్చే 30 నెలలో రాజధాని అమరావతి అంతర్జాతీయ నగరానికి ఉండాల్సిన అన్ని హంగులను పూర్తి చేసుకుంటుంది.