Ratan Tata Innovation Hub: ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కరణల యుగానికి శ్రీకారం చుట్టింది. మంగళగిరి వద్ద రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధికారులు, ఐటీ రంగ ప్రతినిధులు, స్టార్టప్ వ్యవస్థాపకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ ఇన్నోవేషన్ హబ్ నిర్మించబడుతోంది. ప్రపంచ అవసరాలను తీర్చగలిగే స్టార్టప్‌లకు ఇది కేంద్రబిందువుగా మారేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
Also Read: C. P. Radhakrishnan: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్
అమరావతి కేంద్రంగా రాబోయే ఈ హబ్.. డీప్‌టెక్, కృత్రిమ మేధ, సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత ఆవిష్కరణలపై దృష్టి సారించనుంది. ప్రత్యేకంగా క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతూ, ఆధునిక సాంకేతికతలతో కొత్త తరహా పరిశోధనలు, ఆవిష్కరణలకు వేదికగా మలచనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌తో పెట్టుబడులు, స్టార్టప్‌లు, ఇన్నోవేషన్ ఆధారిత విధానాలకు అంతర్జాతీయ స్థాయిలో దృష్టి ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ మేధను ఆకర్షించి, రాష్ట్రాన్ని సాంకేతికత ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించడమే ఈ హబ్ లక్ష్యంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుతో అమరావతి భవిష్యత్తులో గ్లోబల్ స్టార్టప్ డెస్టినేషన్‌గా ఎదగబోతోందనే నమ్మకం వ్యక్తమవుతోంది.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం
మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు
కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్, ఇతర మంత్రులు. #RatanTataInnovationHub… pic.twitter.com/OqpHfyfvpp
— s5news (@s5newsoffical) August 20, 2025
