chandrababu

Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం సా.5 గం.కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుండి ఢిల్లీకి చేరుకోనున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. బుధవారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 100వ జయంతి సందర్భంగా జరగనుంది వేడుకల్లో చంద్రబాబు  పాల్గొననున్నారు. తర్వాత రాష్ట్ర సమస్యలపై కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. తిరిగి బుధవారం రాత్రి అమరావతి కి చంద్రబాబు చేరుకోనున్నారు. 

ఇది కూడా చదవండి: Mahaa Vamsi: రేవంత్ Vs అల్లు అర్జున్..యాక్షన్ లోకి పవన్.

దొంగలను పట్టించిన దేవుడు.

GOD Caught Thieves: నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రాజరాజేశ్వరుని ఆలయంలో రాత్రి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. గర్భగుడి ముందున్న హుండీలోని డబ్బులను తీసేందుకు ప్రయత్నాలు చేశారు. హుండీ ఎంతకూ తెరుచుకోకపోవడంతో హుండీని బయటి దాకా పట్టుకొని వెళ్లి కారులోని వెనుక డిక్కీలో వేసి తీసుకెళ్తున్నారు.

GOD Caught Thieves: ఇంతలో దేవుడే హుండీని కాపాడుకున్నట్టుగా కారు గుంతలో పడి ఒక్కసారిగా పంక్చర్ అయింది. దీంతో ఏం చేయాలో ఆ దొంగలకు తోచలేదు. టైరు మార్చేందుకు ప్రయత్నాలు చేసినా, అటువైపు నుంచి కొంత మంది వ్యక్తులు రావడంతో భయపడి దొంగలు పారిపోయారు.

మిగిలిన వార్త ఇక్కడ చదవండి: GOD Caught Thieves: దొంగలను పట్టించిన దేవుడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *