Chandrababu Naidu

Chandra Babu on Jagan: సెటైర్లు వేయడంలో బాబు రూటే సపరేటు.. జగన్ పేరెత్తకుండానే ఇచ్చి పారేశారుగా ! 

Chandra Babu on Jagan: ఏపీలో టీడీపీ – వైసీపీ మధ్య మాటల యుద్ధం నిత్య వ్యవహారం. మంత్రి నారా లోకేష్ నుంచి టీడీపీ నాయకుల వరకూ అందరూ వైసీపీ నేతలను మాటలతో ఒక ఆట ఆడుకుంటారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఛాన్స్ దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తారు. కానీ ,  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం విధాన పరమైన విషయాలు తప్ప.. నేరుగా జగన్ ను ఒక్క మాట అనరు. అటువైపు నుంచి నేరుగా తనమీద మాటల దాడి జరిగినా సరే జాగ్రత్తగా విమర్శిస్తారు తప్పితే.. వారిలా నోరు పారేసుకోరు. కానీ ,  ఆయన మాటలు మాత్రం సూటిగా జగన్ ను తాకేలా ఉంటాయి .  జగన్ పేరెత్తకుండా చంద్రబాబు నాయుడు వేసే సెటైర్లకు అటువైపు నుంచి సమాధానం కూడా రాదు. ఇదిగో తాజాగా చంద్రబాబు నాయుడు వేసిన సెటైర్లు మామూలుగా లేవు.

Chandra Babu on Jagan: ఢిల్లీలో కేజ్రీవాల్ దారుణ ఓటమి తరువాత అక్కడి ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు .  ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ విజయానికి ప్రధాని మోదీనే కారణమని చెప్పారు .  మోదీ విధానాలకు లభించిన విజయం అని అన్నారు. ఆ తరువాత కేజ్రీవాల్ ఓటమికి . . ఇక్కడ జగన్ ఓటమికి సంక్షేమ పథకాల పేరుతో బటన్లు నొక్కుతూ పోవడమే కారణం అన్నారు .  అంతేకాకుండా . . మద్యం కుంభకోణం ప్రధానంగా కేజ్రీవాల్ ను దారుణ ఓటమికి తీసుకుపోయిందన్నారు .  ఏపీలో కూడా మద్యం స్కామ్ జరిగింది అని చెప్పిన సీఎం చంద్రబాబు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా అది అతి పెద్దది అని సంచలన వ్యాఖ్యలు చేశారు .

Chandra Babu on Jagan: ఇక ప్రజలు ఇచ్చిన స్థానమే శాసనసభలోనూ ఉంటుందన్నారు .  ఓటర్లు ఓట్లు వేసి సీట్లు ఇస్తే ఆ సీట్లు ఆధారంగా అధికార పక్షం . . ప్రతిపక్షం . . ఎమ్మెల్యే ఇలా హోదాలు ఉంటాయని చెప్పారు .  అవసరమైనన్ని సీట్లు ఉంటే దానంత అదే ప్రతిపక్ష హోదా వస్తుందని చంద్రబాబు చెప్పారు .  ఏదైనా హోదా అడుక్కుంటే రాదనీ . . ప్రజలు ఇస్తే ఆటోమేటిగ్గా వస్తుందని అన్నారు .  మన విధానాలు.. పధ్ధతి ప్రజలకు నచ్చితే వారు ఏ హోదా ఇవ్వాలనేది తేల్చుకుంటారన్నారు .  ఎక్కడా జగన్ మాట ఎత్తకుండా సీఎం చంద్రబాబు మాట్లాడినా . . అది సూటిగా జగన్ కి తాకేలా ఉండడం ఇక్కడ విశేషం. జగన్మోహన్ రెడ్డి పద్ధతిని ఎండగట్టడంలో చంద్రబాబు రూటే సపరేటు అని మరోసారి ఈ వ్యాఖ్యలు చెబుతున్నాయి .

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *