Ap News: పదవిని స్వీకరిస్తున్నా..ఎందుకంటే..

Ap News: ప్రభుత్వం పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ముఖ్యమైన బాధ్యతను తనకు అప్పగిస్తూ సలహాదారుగా నియమించడాన్ని స్వాగతిస్తున్నానని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు, గురువుల పట్ల భక్తి, గురుభావం తగ్గడం ఆందోళన కల్గించే అంశమని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవాటు చేసుకోవాలని ప్రముఖ ప్రవచనకర్త సూచించారు. 2017లో టీడీపీ ప్రభుత్వం, 2023లో వైసీపీ ప్రభుత్వం ఆయన స్థాయికి తగ్గ పదవులు ఇచ్చినా ఆయన తిరస్కరించారు.

Ap News: కాగా, రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై చాగంటి స్పందిస్తూ ఈ సారి ఆ పదవిని తీసుకుంటానంటూ స్పష్టం చేశారు. తాను అంగీకరిస్తున్నది పదవుల కోసం కాదని, తనకు ఇప్పుడు ఏ గౌరవం తక్కువ కాలేదన్నారు. మరో ఐదారేళ్లు ఆరోగ్యంగా ఏమైనా చెయ్యగలనని.. అందువల్ల ఈ కొన్నేళ్లలో వేల మంది పిల్లలను కూర్చోబెట్టలేనని అన్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా నైతిక విలువలు పాటించాలని, వాటిని విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని సూచించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Tirumala: తొక్కిస‌లాట బాధితుల‌కు వైకుంఠ ద్వార‌ద‌ర్శ‌నం.. టీటీడీ ప్ర‌త్యేక చొర‌వ‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *