Cellar Collapse: నిరుపేద కూలీలపై మట్టిదిబ్బలు ఒక్కసారిగా కూప్పకూలి పడటంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలిడిచారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మరో నలుగురు కూలీలు శిథిలాల కిందే ఉండిపోయారు. హైదరాబాద్ నగరంలోని ఎల్పీనగర్ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నది. వారంతా బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు.
Cellar Collapse: ఎల్పీనగర్ చౌరస్తా సమీపంలోని ఓ భవనం సెల్లార్‌లో కూలీలు పనులు చేస్తుండగా, మట్టిదిబ్బలు, ఓ హోటల్ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పనులు చేస్తున్న కూలీలను కప్పేయడంతో వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకరికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మరో నలుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. ఇంకా శిథిలాలను తొలగిస్తున్నారు.
నోట్: ఈవార్త అప్‌డేట్ అవుతుంది.