Kodali Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి మరోసారి చట్టపరంగా సమస్య ఎదురైంది. 2024లో ఓ మహిళ అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.
ఏం జరిగింది..?
విశాఖపట్నంలోని ఏయూ న్యాయ కళాశాలలో చదువుతున్న అంజనప్రియ అనే విద్యార్థిని, తాను ఓ మహిళగా ఎంతో అవమానంగా ఫీల్ అయ్యానని, కొడాలి నాని గతంలో సోషల్ మీడియాలో చేసిన అసభ్య వ్యాఖ్యలపై 2024లో విశాఖ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె చెప్పిన ప్రకారం, మూడు సంవత్సరాల పాటు కొడాలి నాని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లను దుర్భాషలాడుతూ, కించపరిచేలా పోస్టులు పెట్టాడని ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Bhadrachalam: భద్రాచలం ఆలయ ఈవో బదిలీ.. కొత్త ఈవోగా దామోదర్‌రావు
ఎలాంటి చట్టాల కింద కేసు..?
ఈ ఘటనపై పోలీసులు ఐటీ యాక్ట్‌తో పాటు BNS 467, 353(2), 352, 351(4), 196(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పట్లో కేసును సీఐ రమణయ్య దర్యాప్తు చేపట్టారు.
గుడివాడలో నోటీసులు
ఈ కేసు విచారణ నిమిత్తంగా ఆదివారం (ఆగస్టు 3), కృష్ణా జిల్లాలోని గుడివాడలో ఉన్న కొడాలి నాని ఇంటికి వెళ్లిన పోలీసులు, విచారణకు హాజరుకావాలని 41 సీఆర్‌పీసీ నోటీసులు అందజేశారు.
