Cabinet Meeting 

Cabinet Meeting: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. కంటైనర్ల తయారీ, గ్రామీణాభివృద్ధికి భారీ నిధులు!

Cabinet Meeting: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. దేశీయ తయారీ రంగాన్ని పరుగులు పెట్టించడంతో పాటు గ్రామీణాభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా మొత్తం నాలుగు ప్రధాన విభాగాలకు కలిపి ఏకంగా రూ.29,267 కోట్ల నిధులను కేటాయించింది.

గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్‌ను హబ్‌గా మార్చే వ్యూహంలో భాగంగా కంటైనర్ల తయారీ (కంటైనర్ మాన్యుఫ్యాక్చరింగ్) రంగానికి రూ.10,000 కోట్లతో ప్రత్యేక ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. దీనితో పాటు క్రీడా రంగానికి ఊతమిస్తూ ‘ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్‌’ను ఆమోదించి, క్రీడా పరికరాల తయారీ కోసం రూ.1,856 కోట్లు కేటాయించింది.
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, పాలనను బలోపేతం చేసేందుకు ‘ప్రధానమంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ యోజన’ పథకాన్ని తీసుకొస్తూ రూ.7,395 కోట్లను మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరటనిస్తూ డీఏ (డియర్‌నెస్ అలవెన్స్), డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) చెల్లింపుల కోసం రూ.10,016 కోట్లను కేబినెట్ కేటాయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *