Road Accident

Road Accident: వరుసగా మూడు బస్సులు ఢీ.. బస్సు లో 109 మంది విద్యార్థులు

Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలో తెలంగాణ విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సులకు ఘోర రోడ్ ప్రమాదం తప్పింది. దివాన్ చెరువు వద్ద మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మూడు బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. నల్గొండ జిల్లా గుండ్లపల్లి మోడల్ స్కూల్ మరియు కళాశాలకు చెందిన సుమారు 109 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అదృష్టవశాత్తూ విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే.. విద్యార్థులు ఈ నెల 17వ తేదీన అరకు, పాడేరు ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లారు. మూడు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, దివాన్ చెరువు వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సు ముందు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అకస్మాత్తుగా ఆగిపోయింది. రోడ్డుపై ఒక గేదె అడ్డు రావడంతో ఆ బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీనితో వెనుకనే వస్తున్న విద్యార్థుల రెండు బస్సులు ఒకదాని వెనుక ఒకటి ఆ ప్రైవేట్ బస్సును ఢీకొన్నాయి.

ఇది కూడా చదవండి: Daily Water Intake by Age: పదే పదే దాహం వేస్తుందా.. వెంటనే డాక్టర్ ని కలవండి

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. సుమారు 26 మంది విద్యార్థులకు మరియు కొందరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చీకటి సమయంలో ఈ ప్రమాదం జరిగినప్పటికీ, ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులు తమ స్వస్థలాలకు చేరుకోవడానికి పోలీసులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *