Bullet Train: భారతదేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బుల్లెట్ రైలు నడిచే రోజు రానే వచ్చింది. దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపుదాల్చుతున్నాయి. ఇప్పటికే తొలి విడత చేపట్టే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య నడిచే తొలి బుల్లెట్ ట్రైన్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Bullet Train: ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య నిర్మాణం చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి పూర్తవుతాయిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు 2027 ఆగస్టు 15న తొలి బుల్లెట్ ట్రైన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఆ తర్వాత దశలవారీగా కార్యకలాపాలను విస్తరిస్తామని తెలిపారు.
Bullet Train: ఇదిలా ఉండగా భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. తాజాగా వందేశారత్ స్లీపర్ రైళ్లను కేంద్ర రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. ఈ మేరకు తొలి స్లీపర్ రైళ్లను పశ్చిమబెంగాల్-అస్సాం రాష్ట్రాలను కలుపుతూ కోల్‌కత్తా-గుహవాటి మధ్య తొలి రైలును ప్రారంభించనున్నది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
