Bullet Train:జపాన్, చైనాలో అందుబాటులో ఉన్న బుల్లెట్ ట్రైన్‌లు మన దేశంలో ఎప్పుడొస్తాయి? మనమెప్పుడు ఎక్కి తిరుగుదాం? మనకు అంత సామర్థ్యం లేదా? ఇలాంటి సౌకర్యాలపై దృష్టి పెట్టాలి! ఇవన్నీ పటాపంచలు చేస్తూ మన దేశానికీ బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. ఈ మేరకు తాజాగా ఒప్పందాలు కూడా కుదిరాయి. అంతా సక్రమంగా జరిగితే నాలుగైదేండ్లలో మన దేశంలో బుల్లెట్ ట్రైన్ దూసుకుపోనున్నది.
Bullet Train:జపాన్‌లో పెద్ద ఎత్తున బుల్లెట్ ట్రైన్లు నడుస్తున్నాయి. ఇంకా ఆత్యాధునికి రైళ్లను కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో మాదిరిగా మనదేశంలోనూ పరిచయం చేయాలని నిర్ణయించారు. షిన్‌కాన్‌సెన్ ఈ5 (shinkansen E5) మోడల్ బుల్లెట్ రైలును 2029-30లో భారతదేశంలోనూ ప్రారంభించేలా జపాన్ దేశంతో ఒప్పందం కుదిరింది.
Bullet Train:అధునాతనమైన ఈ షిన్‌కాన్‌సెన్ ఈ5 (shinkansen E5) మోడల్ బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలరు. అంతేకాకుండా 400 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలిగే సామర్థ్యం కూడా దీనికి ఉన్నది. దీనిని జపాన్, ఇండియాలో ఒకేసారి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.