BRS: ఏబీఎన్ చానల్‌పై తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి అన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఏబీఎన్ చానల్ ప్రతినిధులకు అనుమతి లేదని ఆ పార్టీ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పట్ల ఏబీఎన్ చానల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరును ఆ ప్రకటనలో ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది.
BRS: ఇక నుంచి ఏబీఎన్ టీవీ చానల్ చర్చల్లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొనరాదని బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయించిందని పేర్కొన్నది. తెలంగాణ భవన్, ఇతర బీఆర్ఎస్ కార్యాలయాల్లో జరిగే సమావేశాలకు ఏబీఎన్ చానల్ ప్రతినిధులను ఇకపై అనుమతించరాదని పార్టీ నిర్ణయించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నది.
BRS: తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో రాష్ట్ర నాయకత్వంపై ఆంధ్రజ్యోతి అసభ్యకర కథనాలను వండివార్చిందని పేర్కొన్నది. బీఆర్ఎస్ నాయకులపై అసత్య కథనాలను ప్రచురించిందని ఆరోపించింది. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా పదేపదే కథనాలను ప్రచురిస్తుందని ఆరోపించింది. ఇప్పటికీ ఆ చానల్ తీరు మారలేదని తెలిపింది.
BRS: అదే చానల్లో డిబేట్‌కు శాసనమండలి సభ్యుడైన తక్కెళ్లపల్లి రవీందర్రావును పిలిచి గెటవుట్ ఫ్రం మై చానల్ అంటూ న్యూస్ రీడర్ అనుచితంగా ప్రవర్తించారని, ఆయన తన వ్యాఖ్యలు.. పాత్రికేయ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నది. ఆయన తన వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
