Bride Warning: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హనీమూన్ మర్డర్ కేసు మరువకముందే, మరో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఈసారి విషయంలో మర్డర్ జరగలేదు కానీ, కొత్త పెళ్లికొడుకు మూడు రాత్రులు నిద్రలేని జీవితం గడిపాడు. అతడి భార్య కత్తి పట్టుకుని బెదిరించిన సంఘటన అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
ఏమైందంటే..
ప్రయాగ్‌రాజ్‌కు చెందిన కెప్టెన్ నిషాద్ అనే యువకుడికి, కరాచన దీహా గ్రామానికి చెందిన సితారతో ఈ ఏప్రిల్ 29న పెళ్లి జరిగింది. మే 2న రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా జరిగింది. కానీ కొత్తజంట జీవితం గడపాల్సిన తొలి రాత్రే ఊహించని మలుపు తిరిగింది.
తాకితే 35 ముక్కలు చేస్తా!
రాత్రి గదిలోకి వెళ్లిన నిషాద్‌కు ఎదురైన దృశ్యం భయానకం. సితార ముసుగుతో కూర్చుని చేతిలో పదునైన కత్తి పట్టుకుని బెదిరించింది. “నన్ను తాకొద్దు.. ఈ శరీరం అమన్‌కు అంకితం.. నీవు దగ్గర అయితే ముక్కలు చేస్తా” అని స్పష్టం చేసింది. ఇది విని నిషాద్ గుండె భయంతో నిండిపోయింది. ఏం చేయాలో తెలియక, మూడు రాత్రులు సోఫాలో కూర్చుని నిద్రలేక గడిపాడు.
ఇది కూడా చదవండి: IAS Amrapali: ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి ఊరట: తెలంగాణ క్యాడర్‌కు తిరిగి కేటాయించిన క్యాట్
ప్రేమ అమన్‌తో… పెళ్లి ఒత్తిడి వల్ల!
నిషాద్ చెబితే – సితార తనకు అసలు పెళ్లి చేయాలన్న అభిప్రాయం లేకుండా, తల్లిదండ్రుల ఒత్తిడితోనే చేసానని చెప్పింది. తన మనసు అమన్ అనే యువకుడి కి ఇచ్చినటు చెప్పింది, అతనితోనే జీవితం గడపాలనుకుంటున్నట్లు చెప్పింది. ఈ మాటలు విని నిషాద్ మరియు అతని కుటుంబం షాక్‌కు గురయ్యారు.
కుటుంబ పెద్దల చర్చలు… పోలీసుల జోక్యం!
ముగింపుగా ఈ వ్యవహారం ఊర్లో పంచాయతీకి దారి తీసింది. కుటుంబ పెద్దలు సితారను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు శాంతంగా ఉన్న సితార మళ్లీ వేధింపులకు దిగింది. చివరికి నిషాద్ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. విచారణ జరుగుతుండగానే, సితార తన ప్రియుడు అమన్‌తో పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సోనమ్ ఉదంతం తర్వాత మరోసారి యువతుల ప్రేమ వ్యవహారాలు పెళ్లిళ్లను ప్రభావితం చేస్తున్న ఘటనల సంఖ్య పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనలు తెలియజేస్తున్న విషయం:
పెళ్లి అనేది ఇద్దరి మధ్య ఒప్పందం మాత్రమే కాదు.. రెండు కుటుంబాల గౌరవం కూడా. ఇలా ముందుగా ప్రేమలో ఉన్నవారు తమ మనసులోని మాటను ముందే చెప్పకపోతే, పెళ్లిళ్లు ఓ నాటకంగా మారుతున్నాయి. ఇది తల్లిదండ్రులకూ, కొత్త జీవిత భాగస్వాములకూ నష్టం తెస్తోంది. అలాంటి పరిస్థితులు రాకుండా మనసు పెరిగిన దశలోనే స్పష్టతతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.