BRAOU: ఆదివాసీ విద్యార్థులైన వారికి ఉచితంగా ఉన్నత విద్య చదివే అవకాశం కల్పిస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, దూరభారం ఖర్చులు భరించలేక, ఉన్నత విద్య చదవాలనే చైతన్యం లేక మధ్యలోనే ఎందరో ఆదివాసీ విద్యార్థినీ, విద్యార్థులు తమ చదువును ఆపేస్తున్నారు. దీంతో ఉన్నత విద్యకు వారు దూరం అవుతున్నారు. అవకాశాలు ఉన్న వారే ఉన్నత విద్య చదువుకుంటున్నారు.
BRAOU: ఈ నేపథ్యంలో ఆదివాసీ బిడ్డలకు ఈ విద్యా సంవత్సరం నుంచే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఉచితంగా ఉన్నత విద్యను అందించనున్నారు. ఈ మేరకు ఆ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ (వీసీ) ఘంటా చక్రపాణి తెలిపారు. ఆదివాసీలకు చదువును చేరువ చేయాలనే సత్సంకల్పంతో ఒక ప్రణాళిక రూపొందించినట్టు ఆయన వెల్లడించారు.
BRAOU: ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా చదువులు చెప్తామని వీసీ ఘంటా చక్రపాణి తెలిపారు. గోండు, కోయ, చెంచు తదితర తెగలకు చెందిన ఆదివాసీ విద్యార్థులకు కేవలం రూ.500తోనే అడ్మిషన్, పుస్తకాలు అందించనున్నారు. ఇతర వివరాల కోసం 040-23680333, 23680555 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వీసీ ఘంటా చక్రపాణి తెలిపారు.