Akhanda 2: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా సీక్వెల్ ‘అఖండ 2’ సినీ అభిమానుల్లో హైప్ పెంచుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో స్పెషల్ ఎలిమెంట్‌గా బాలయ్య త్రిశూలం చర్చనీయాంశంగా మారింది. బోయపాటి సినిమాల్లో ఆయుధాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ‘అఖండ’లో అఘోర గెటప్‌లో బాలయ్య చేతిలోని త్రిశూలం హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ‘అఖండ 2’ కోసం బోయపాటి అడ్వాన్స్‌డ్ వెర్షన్ త్రిశూలాన్ని డిజైన్ చేయించారని సమాచారం. మైథాలజీ టచ్‌తో, డిఫరెంట్ లుక్‌లో ఈ త్రిశూలం ఆకట్టుకోనుందట. బాలయ్య ఈ సినిమాలో ఎలాంటి గెటప్‌లో మెస్మరైజ్ చేస్తారనే ఆసక్తి నెలకొంది. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్, డైలాగ్‌లతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయనుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. త్వరలో రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ రానుందని టాక్.
