Bomb Blast: పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం జరిగిన పేలుడులో 24 మంది మరణించారు. వీరిలో 14 మంది సైనికులు ఉన్నారు. ఈ పేలుడులో 50 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం, ఉగ్రవాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్‌ఎ) ఈ దాడికి బాధ్యత వహించింది. ఇది ఆత్మాహుతి దాడి అని, దీని లక్ష్యం స్టేషన్‌లో మోహరించిన పోలీసు సిబ్బంది అని BLA చెప్పారు.
ఈ దాడి వెనుక బీఎల్‌ఏ హస్తం ఉందని పాకిస్థాన్ అధికారులు ధృవీకరించలేదు. అయితే ప్రాథమిక విచారణలో ఇది ఆత్మాహుతి దాడిగా తెలుస్తోంది. గాయపడిన పలువురు ప్రయాణికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారులు తెలిపారు. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్‌పైకి వస్తుండగా పేలుడు సంభవించింది.
Bomb Blast: ప్లాట్‌ఫారమ్‌పై ప్రయాణీకులు అధికంగా ఉన్నారు . పాకిస్తాన్ వార్తా వెబ్‌సైట్ ట్రిబ్యూన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, జాఫర్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్‌కు చేరుకునే ముందు ఈ ప్రమాదం జరిగింది. 9 గంటలకు రైలు పెషావర్‌కు బయలుదేరుతుందని క్వెట్టా సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు రైలు కోసం వేచి ఉన్నారు. పేలుడు జరిగిన సమయంలో ప్లాట్‌ఫాంపై 100 మందికి పైగా ఉన్నారని తెలిపారు. బుకింగ్ ఆఫీస్ దగ్గర పేలుడు జరిగినట్లు కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
Bomb Blast: ఆగష్టు 26 న, BLA రైల్వే వంతెనను పేల్చివేసింది. దీని తరువాత క్వెట్టా – పెషావర్ మధ్య రైలు సేవలను నిలిపివేశారు. దాదాపు ఒకటిన్నర నెలల తర్వాత మళ్లీ అక్టోబర్ 11 నుంచి రెండు నగరాల మధ్య రైలు సర్వీసును ప్రారంభించారు. ఈరోజు నవంబర్ 9న క్వెట్టా నుంచి పెషావర్‌కు రైలు రాకముందే రైల్వే స్టేషన్‌లో పేలుడు జరిగింది.
బలూచిస్థాన్ ముఖ్యమంత్రి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు . పేలుడు తర్వాత, గాయపడిన వారిని క్వెట్టా సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీని ప్రకటించారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇతర ఆసుపత్రుల నుండి వైద్యులు, నర్సులను కూడా పిలిపించారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం 46 మంది చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Bomb Blast: బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఘటన అనంతరం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి తక్షణమే విచారణకు ఆదేశించారు. అమాయకులను టార్గెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులు, భద్రతా బలగాలు స్టేషన్‌కు భద్రత కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి షాహిద్ రింద్ తెలిపారు. అక్కడ బాంబు నిర్వీర్య నిపుణులు పనిచేస్తున్నారు. ఈ ఘటనపై అధికారిక నివేదిక త్వరలో రానుంది.